సైరా నరసింహారెడ్డి లో మెగా డాటర్


సైరా లో మెగా డాటర్ సైరా నరసింహారెడ్డి చిత్రంలో మెగా డాటర్ నిహారిక ఓ ముఖ్య పాత్ర పోషించనుందని సమాచారం . ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నిహారిక అయితే ఆ సినిమా ఘోర పరాజయం పొందడంతో నిహారిక కెరీర్ అంత సవ్యంగా సాగడం లేదు దాంతో వెబ్ సిరీస్ లను ప్రారంభించింది . అంతకుముందే టివి షోలలో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించింది నిహారిక . ఇటీవలే ఓ తమిళ సినిమాలో కూడా నటించింది .

అయితే అనుకున్న స్థాయిలో కెరీర్ ఊపందుకోలేక పోయింది దాంతో క్రేజీ ప్రాజెక్ట్ అందునా పెద్దనాన్న నటిస్తున్న సినిమా కావడంతో సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించడానికి ఉత్సాహపడుతోంది నిహారిక . చిరంజీవి కి కూడా నిహారిక అంటే మక్కువ కాబట్టి నిహారిక కు మంచి పాత్ర ఇవ్వొచ్చు కూడా . అయితే అధికారికంగా మాత్రం ఆ చిత్ర యూనిట్ ఈ విషయాన్నీ వెల్లడించాల్సి ఉంది .