మెగా డాట‌ర్ నిహారిక వెడ్డింగ్ కార్డ్ వైర‌ల్‌!మెగా డాట‌ర్ నిహారిక వెడ్డింగ్ కార్డ్ వైర‌ల్‌!
మెగా డాట‌ర్ నిహారిక వెడ్డింగ్ కార్డ్ వైర‌ల్‌!

మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల వివాహం ఈ నెల 9న జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. గుంటూరుకు చెందిన ఐజీ జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర్‌రావు త‌న‌యుడు, టెక్కీ జొన్న‌ల‌గ‌డ్డ  చైత‌న్యతో నిహారిక వివాహం జ‌ర‌గ‌బో‌తోంది. వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఆగ‌స్టులో వీరి నిశ్చితార్థం జ‌రిగింది. బంధు మిత్రులంతా పాల్గొన‌గా హైద‌రాబాద్‌లో ట్ట‌హాసంగా ఎంగేజ్‌మెంట్ వేడుక జ‌రిగింది.

డిసెంబ‌ర్ 9న వివాహం రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ ఉద‌య్ విలాస్‌లో అత్యంత ఆడంబ‌రంగా జ‌ర‌గ‌బోతోంది. రాత్రి 7:15 నిమిషాల‌కు వివాహం జ‌ర‌గ‌బోతోంది. పెళ్లి సరిగ్గా వారం రోజులు వుండ‌టంతో పెళ్లి ప‌త్రిక‌ల పంపిణీ మొద‌లెట్టారు మెగా ఫ్యామిలీ. తాజాగా బ‌య‌టికి వ‌చ్చిన మెగా డాట‌ర్ నిహారిక వెడ్డింగ్ కార్డ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

పెళ్లి ప‌త్రిక‌ని ఓ బాక్స్ త‌ర‌హాలో ముద్రించారు. ఓపెన్ చేస్తే వెడ్డింగ్ కార్డ్ క‌నిపిస్తోంది. వెన్యూ డిటైల్స్‌, మూహూర్తం టైమ్‌, వంటి వివ‌రాల‌ని అందులో పొందుప‌స‌రిచారు. బాక్స్‌పై ఎన్ సీ అనే లెట‌ర్స్ డిజైన్ మిడిల్‌లో క‌న‌పిప‌సిస్తున్నాయి. అంటే ఎన్ అంటే నిహారిక‌, సీ అంటే చైత‌న్య అని సింబాలిక్‌గా ప్రింట్ చేయించారు. కొత్తగా వున్న ఈ వెడ్డింగ్ కార్డ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.