మెగా ఫ్యామిలీ వినూత్న ప్ర‌చారం!


మెగా ఫ్యామిలీ వినూత్న ప్ర‌చారం!
మెగా ఫ్యామిలీ వినూత్న ప్ర‌చారం!

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఏ దేశం గురించి విన్నా క‌రోనా మ‌ర‌ణాలే .. క‌రోనా కేసులే. అయితే… ప్ర‌పంచ దేశాల‌న్నీ భార‌త్ క‌రోనా వైర‌స్‌ని ఎలా ఎదుర్కో బోతోంది?.. మ‌న క‌న్నా సంప‌న్న దేశం కాదు క‌దా.. స‌రైన వ‌న‌రులు  కూడా లేవు క‌దా.. విక‌టిస్తే భారీ మేల్యం చెల్లించాల్సిందేనా? అని ఆశ్చ‌ర్యంగా మ‌న వైఉ చూస్తున్న వేళ ఇది. అయితే వారినే ఆశ్చ‌ర్యంలో ముంచేస్తూ మ‌నం ఐక్య‌‌త ఏంటో ఇప్ప‌టికే చూపించాం.

ఇంటి ప‌ట్టునే వుంటూ లాక్ డౌన్‌ని పాటిస్తూ క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తున్నాం. ఇదే ప్ర‌పంచ దేశాల‌ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంద‌ట‌‌. ఇదిలా వుంటే క‌రోనా నివార‌ణ‌కు మేము సైతం అంటూ సినిమాల్లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోనూ  ప్ర‌జ‌ల‌కు అండ‌గా వుంటామ‌ని మెగా ఫ్యామిలీ నిరూపిస్తోంది. లాక్‌డౌన్ స‌మ‌యంలో క‌రోనా క‌ట్ట‌డి కోసం ఇంటికే ప‌రిమితం కావాల‌ని ఫ్యామిలీ అంతా వినూత్న ప్ర‌చారానికి తెర లేపింది.

స్టే హోమ్‌..ఇంట్లో వుంటాం.. యుద్దం చేస్తాం.  క్రిమిని కాదు ప్రేమ‌ని పంచుతాం. కాలు క‌ద‌ప‌కుండా క‌రోనాని త‌రిమేస్తాం. భార‌తీయులం ఒక్క‌టై .. భార‌త్‌ని  గెలిపిస్తాం స్టే సేఫ్ అనే ప్లా కార్డుల‌తో చిరంజీవి, అల్లు ర‌వింద్‌, నాగ‌బాబు, రామ్‌చ‌ర‌ణ్ ఉపాస‌న‌, ‌వ‌రుణ్‌‌తేజ్‌, సాయిధ‌ర‌మ్‌తేజ్‌, నిహారిక‌, వైష్ణ‌వ్‌తేజ్‌, అల్లు శిరీష్‌, సుష్మిత‌, శ్రీ‌జ‌,  క‌ల్యాణ్ దేవ్ వినూత్న ప్ర‌చారం ఆక‌ట్టుకుంటోంది.

Credit: Twitter