మెగా డాట‌ర్ వెడ్డింగ్ సింపుల్‌గానే..?


మెగా డాట‌ర్ వెడ్డింగ్ సింపుల్‌గానే..?
మెగా డాట‌ర్ వెడ్డింగ్ సింపుల్‌గానే..?

మెగా డాట‌ర్ కొణిదెల నిహారిక వెడ్డింగ్ గురించి వ‌చ్చిన‌న్ని వార్త‌లు ఏ స్థార్ హీరో పెళ్లి గురించి కూడా రాలేదు. గ‌త కొంత కాలంగా పెళ్లి వార్త‌ల‌తో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న నిహారిక వివాహం త్వ‌ర‌లో గుంటూరుకు చెందిన టెక్కీ చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌తో జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే త‌న‌కు కాబోయే వ‌రుడికి సంబంధించిన ఫొటోల‌ని నిహారిక సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది.

అప్ప‌టి నుంచి నిహారిక పెళ్లి ఎప్పుడు? ఎక్క‌డ ఎలా జ‌ర‌గ‌బోతోంది? ఎంత మంది హాజ‌రు కాబోతున్నారు?.. మెగా ఫ్యామిలీలో పెళ్లి అంటే భారీ స్థాయిలోనే వుంటుంది. అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు మెగా అభిమానులు కూడా ఆసక్తిగా చ‌ర్చించుకుంటున్నారు. పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదు కానీ వ‌చ్చే ఏడాది మాత్రం వీరి వివాహం వుంటుంద‌ని మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఇటీవ‌ల వెల్ల‌డించారు. ఇది వ్య‌క్తిగ‌త ఫంక్ష‌న్ అని, ప‌బ్లిక్ ఫంక్ష‌న్ కాద‌ని స్ప‌ష్టం చేశారు కూడా.

త్వ‌ర‌లో ఎంగేజ్‌మెంట్‌ని అత్యంత స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యుల మ‌ధ్య జ‌రిపించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇక వెడ్డింగ్ మాత్రం క‌రోనా ప్ర‌భావాన్ని బ‌ట్టి వుంటుంద‌ట‌. క‌రోనా క్రైసిస్ ఇలాగే కొన‌సాగితే సింపుల్ గా వెడ్డింగ్ జ‌రిపించాల‌ని అనుకుంటున్నార‌ట‌. నిహారికకు కాబోయే వ‌రుడు గుంటూరు ఐజీ త‌న‌యుడ‌ని చెబుతున్నారు. దీనికి సంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి వుంది.