ఆర్ ఆర్ ఆర్ సినిమా లేటెస్ట్ అప్డేట్ కు మెగా ఫ్యాన్స్ ఖుషీ


RRR
ఆర్ ఆర్ ఆర్ సినిమా లేటెస్ట్ అప్డేట్ కు మెగా ఫ్యాన్స్ ఖుషీ

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ నెమ్మదిగా జరుగుతోంది. ఇటీవలే తారక్ తో కలిసి బల్గేరియా వెళ్లిన ఆర్ ఆర్ ఆర్ బృందం అక్కడ కొమరం భీం పాత్ర పరిచయ సన్నివేశంతో పాటు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. రాజమౌళి అంటేనే హీరో ఎలివేషన్స్ కు పెట్టింది పేరు. ఈ సినిమాలో కూడా తారక్ ఇంట్రడక్షన్ అదిరిపోతుందని సమాచారం. బల్గేరియా షెడ్యూల్ అయిపోవడంతో ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం హైదరాబాద్ చేరుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం తర్వాతి షెడ్యూల్ లో రామ్ చరణ్ ఉండే సీన్లు షూట్ చేస్తారట. దాని తర్వాత కొన్ని రోజులకు ఇద్దరి కాంబినేషన్ లో సీన్లు తీస్తారని తెలుస్తోంది. ఈ న్యూస్ వినగానే మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొన్ని రోజులుగా ఇందులో చరణ్ పాత్రకు తగినంత ప్రాధాన్యం లేదని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు అవన్నీ అబద్ధాలేనని తెలుస్తోంది. అయితే తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్ లోనే సాగనుంది.