మెగా ఫ్యాన్స్ ని నిరాశపరిచిన రాజమౌళి


Ram Charan
Ram Charan

దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి మెగా ఫ్యాన్స్ ని నిరాశపరిచాడు . ఈరోజు అల్లూరి సీతారామరాజు పుట్టినరోజు కావడంతో అల్లూరి సీతారామరాజు గెటప్ లో రాంచరణ్ తేజ్ ఎలా ఉంటాడో చూసుకోవాలని ముచ్చట పడ్డారు మెగా ఫ్యాన్స్ . అయితే షూటింగ్ అనుకున్న విధంగా సాగకపోవడమో ? లేక రిలీజ్ కి ఇంకా సమయం ఉంది అని అనుకోవడమో కానీ మొత్తానికి అల్లూరి సీతారామరాజు గెటప్ ని రివీల్ చేయలేదు రాజమౌళి .

దాంతో మెగా ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు . అయితే షూటింగ్ అనుకున్న విధంగా సాగకపోవడంతో వ్యక్తిగత పనుల నిమిత్తం అమెరికా వెళ్ళాడు రాజమౌళి . ఈ విషయాన్నీ గురించి తాజాగా ట్వీట్ చేస్తూ నేను అమెరికా వచ్చాను కానీ తానా సభల కోసం అయితే కాదు అంటూ ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చాడు . జూనియర్ ఎన్టీఆర్ అలాగే రాంచరణ్ లకు ఇద్దరికీ కూడా గాయాలు కావడంతో షూటింగ్ వాయిదాపడిన విషయం తెలిసిందే . ఇక ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా అల్లూరి సీతారామరాజు గా చరణ్ నటిస్తున్నాడు .