ఆర్‌.ఆర్‌.ఆర్‌ విషయంలో ‘మెగా’ కలవరం


RRR
RRR

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్ర షూటింగ్ పనుల్లో బల్గేరియాలో బిజీగా ఉన్నాడు. అక్కడ ఎన్టీఆర్ పై భారీ పోరాట దృశ్యాల చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పుడు ఇదే విషయంలో మెగా ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. ఎంతసేపూ ఎన్టీఆర్ చిత్రీకరణకు సంబంధించిన వార్తలే వింటున్నాము కానీ చరణ్ గురించి అసలు న్యూస్ రావట్లేదేంటి అన్న ఆందోళన వారిలో మొదలైంది.

అసలు రామ్ చరణ్ ఈ చిత్రంలో సరైన వెయిట్ ఉందా అంటూ మెగా ఫ్యాన్స్ కు కొత్త సందేహాలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఇక్కడ అర్ధం చేసుకోవాల్సిన విషయం ఇది ఇద్దరు పోరాట యోధుల గురించిన కథ. అంటే ఒకరి గురించి చెప్పి ఆపేయలేరు కదా.

ప్రస్తుతం రామ్ చరణ్ సైరా నరసింహారెడ్డి ప్రమోషన్ల కార్యక్రమాలలో బిజీగా ఉన్నాడు. సైరా ప్రమోషన్లు ఉన్నాయనే కావాలని రామ్ చరణ్ తన పార్ట్ షూటింగ్ ను తర్వాత పెట్టమని అడిగి ఉంటాడు. పైగా అక్కడ ఉన్నది రాజమౌళి. ఫ్యాన్స్ ఎమోషన్స్ కు పెద్ద పీట వేసే రాజమౌళి ఈ విషయాన్ని విస్మరించడు కదా.