మెగాస్టార్ – మెహ‌ర్ ర‌మేష్ ..వ‌ద్దంటున్నారా?


మెగాస్టార్ - మెహ‌ర్ ర‌మేష్ ..వ‌ద్దంటున్నారా?
మెగాస్టార్ – మెహ‌ర్ ర‌మేష్ ..వ‌ద్దంటున్నారా?

కొన్ని కాంబినేష‌న్‌లు ఎప్పుడెప్పుడు సెట్ట‌వుతాయా అని ఫ్యాన్స్ ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురుచూస్తుంటారు. కానీ కొన్ని కాంబినేష‌న్స్ సెట్ట‌వుతున్నాయంటేనే భ‌యంతో బెంబేలెత్తిపోతుంటారు. ప్ర‌స్తుతం మెగా ఫ్యాన్స్ ఇందులో రెండో ఫీలింగ్‌ని అనుభ‌విస్తున్నార‌ట‌. కొర‌టాల శివ – చిరు కాంబినేష‌న్ అన‌గానే పండ‌గ చేసుకున్న ఫ్యాన్స్ మెగాస్టార్ – మెహ‌ర్ ర‌మేష్ అన‌గానే భ‌య‌ప‌డుతున్నార‌ట‌.

మెహ‌ర్ ర‌మేష్ చేసిన కంత్రి, శ‌క్తి, షాడో చిత్రాలు బాక్సీఫీస్ వ‌ద్ద భారీ వైఫ‌ల్యాల‌ని చ‌విచూశాయి. అత్యంత డిజాస్ట‌ర్‌లుగా నిలిచాయి. ఇక మెహెర్ క‌న్న‌డ‌లో చేసిన `వీర క‌న్న‌డీగ‌` సూప‌ర్ హిట్ గా నిలిచినా ఆ క్రెడిట్ పూరీ జ‌గ‌న్నాథ్‌కే ద‌క్కింది. ఎందుకంటే ఆ చిత్రాన్ని `ఆంధ్రావాలా` ఆధారంగా క‌న్న‌డ‌లో రీమేక్ చేశాడు కాబ‌ట్టి. ఆ త‌రువాత క‌న్న‌డ‌లో చేసిన `అజ‌య్‌` మ‌హేష్ `ఒక్క‌డు`కు రీమేక్‌.. ఆ త‌రువాత చేసిన `కంత్రీ` అమెరిక‌న్ రొమాంటిక్ డ్రామా `జ‌స్ట్ మై ల‌క్ చిత్రాన్ని ఆధారం చేసుకుని తీసిందే.

ఇక ప్ర‌భాస్ చేసిన `బిల్లా` గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అజిత్ `బిల్లా`కు రీమేక్ అది. స్టైయిట్‌గా చేసిన `శ‌క్తి`, షాడో అట్ట‌ర్ ఫ్లాప్‌లుగా నిలిచాయి. దీంతో ఏ న‌మ్మ‌కంతో మెహ‌ర్‌కు సినిమా ఇస్తున్నార‌ని మెగా ఫ్యాన్స్ కంగారు ప‌డుతున్నార‌ట‌. అయితే ఇక్క‌డో విష‌యం చెప్పాలి. మెహెర్ చేసిన  స్టైయిట్ సినిమాలు ఫ్లాప్ అయినా రీమేక్ చిత్రాలు మాత్రం ఫ్లాప్ కాలేదు. ఆ ట్రాక్ రికార్డ్‌ని న‌మ్మే `వేదాలం` రీమేక్‌ని మెహెర్ ర‌మేష్ కి చిరు అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాపై ఇప్ప‌టికే ప‌వ‌న్‌క‌ల్యాణ్ క్లారిటీ ఇచ్చిన విష‌యం తెలిసిందే.