పేరు మార్చుకున్న హీరో హిట్ కొడతాడా ?


మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన పేరుని ”సాయి తేజ్ ” గా మార్చుకున్నాడు , పేరు మార్చుకున్న తర్వాత సాయి తేజ్ నటించిన ” చిత్రలహరి ” అనే చిత్రం రిలీజ్ కి సిద్ధమైంది . ఈనెల 12న చిత్రలహరి విడుదల కానుంది మరి ఈ సినిమా హిట్ అయితే సాయి తేజ్ సెంటిమెంట్ నిజం అవుతుంది లేదంటే షరా మామూలే ! మరో ప్లాప్ ఈ హీరో జాబితాలో పడుతుంది .

సాయి తేజ్ ఇంతకుముందు వరుసగా ఆరు డిజాస్టర్ లు ఎదుర్కొన్నాడు . తిక్క , విన్నర్ , ఇంటలిజెంట్ , నక్షత్రం , జవాన్ , తేజ్ ఐ లవ్ యు చిత్రాలు దారుణంగా దెబ్బకొట్టాయి . దాంతో కొంత గ్యాప్ తీసుకొని చిత్రలహరి అనే సినిమా చేసాడు మెగా మేనల్లుడు . నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు . దాంతో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు ఈ హీరో . ఈనెల 12న చిత్రలహరి విడుదల అవుతుండటంతో సినిమా హిట్ కావాలని పరితపించి పోతున్నాడు పాపం . మరి హిట్ కొడతాడా ? లేదా మరో ప్లాప్ కొడతాడా ? చూద్దాం .