మరో మెగా హీరో పరిచయం అయ్యేది రేపే


Mega hero Vaishnav tej debut with sukumar films

మెగా కుటుంబం నుండి ఇప్పటికే పలువురు హీరోలు పరిచయం కాగా రేపు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కానున్నాడు . వైష్ణవ్ తేజ్ ఇంతకుముందు బాలనటుడిగా చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎం బి బి ఎస్ చిత్రంలో నటించాడు . కట్ చేస్తే ఇన్నాళ్లకు హీరోగా పరిచయం కానున్నాడు . అన్నట్లు ఈ వైష్ణవ్ తేజ్ ఎవరో తెలుసా ……. మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడే ఈ వైష్ణవ్ తేజ్ .

రేపు మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా పలువురు మెగా హీరోలు అలాగే చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు . దర్శకులు సుకుమార్ మైత్రి మూవీస్ సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది . ఇక ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు . రేపు ఉదయం హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో గల రామానాయుడు సినీ విలేజ్ లో ఈ కొత్త సినిమా ప్రారంభం కానుంది . ఇప్పటికే మెగా కుటుంబం నుండి బోలెడు మంది హీరోలు ఉండగా వాళ్ళ జాబితాలో వైష్ణవ్ తేజ్ కూడా చేరాడు .

English Title: Mega hero Vaishnav tej debut with sukumar films