మెగా హీరోల డిజాస్టర్ లు


Mega heroes disasters in 2018
Mega heroes

ఈ ఏడాది మెగా హీరోలు డిజాస్టర్ లను చవిచూశారు . రాంచరణ్ రంగస్థలం తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు , వరుణ్ తొలిప్రేమ తో హిట్ కొట్టాడు కానీ అంతరిక్షం తో మరో ప్లాప్ కొట్టాడు , ఇక మిగిలిన మెగా హీరోలు డిజాస్టర్ లతో నిర్మాతలను , బయ్యర్లను ముంచేశారు . పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన విషయం తెలిసిందే . ఆ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడటంతో బయ్యర్లు పోటీపడి మరీ కొన్నారు . కట్ చేస్తే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత చెత్త చిత్రంగా రికార్డులు సృష్టించింది దాంతో ఘోరంగా నష్టపోయారు బయ్యర్లు .

ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రాలు రెండు విడుదల అయ్యాయి ఈ ఏడాది . అందులో ఒకటి ఇంటలిజెంట్ , మరొకటి తేజ్ ఐ లవ్ యు ఈ రెండు కూడా డిజాస్టర్ లు అయ్యాయి . అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కూడా ఘోరంగా దెబ్బకొట్టింది . నిహారిక నటించిన హ్యాపీ వెడ్డింగ్ కూడా ప్లాప్ అయ్యింది . అలాగే చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్  హీరోగా పరిచయమైన చిత్రం విజేత ఆ సినిమా కూడా ఘోర పరాజయం చవిచూసింది . దాంతో 2018 లో మెగా హీరోలకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి . ఒక్క చరణ్ కు తప్ప .

English Title: Mega heroes disasters in 2018