మెగా హీరోలకు హిందీ మార్కెట్ కలిసిరావట్లేదా?


మెగా హీరోలకు హిందీ మార్కెట్ కలిసిరావట్లేదా?
మెగా హీరోలకు హిందీ మార్కెట్ కలిసిరావట్లేదా?

మన తెలుగు హీరోలు ముందు నుండి వేరే భాషల్లో సినిమాలను మార్కెట్ చేసుకోవడంలో వెనుకబడి ఉన్నారు. తమిళ హీరోలు తెలుగులో మార్కెట్ సంపాదించగలిగారు కానీ తెలుగు హీరోలు ఇంతవరకూ మార్కెట్ సంపాదించలేకపోయారు. ఒకసారి ప్రయత్నించి విఫలమవగానే మళ్ళీ అటువైపు చూడకపోవడం కూడా నెగటివ్ అని చెప్పవచ్చు. మహేష్ బాబు స్పైడర్ తో తమిళ సినిమా వైపు వెళ్లాలనుకున్నాడు కానీ అది బెడిసికొట్టడంతో ప్రయత్నాలు మానుకున్నాడు.

మెగా హీరోల విషయానికి వస్తే వారికి కర్ణాటకలో ఎప్పుడూ మంచి మార్కెట్ ఉంది. మొదటినుండి వారి సినిమాలు బానే ఆడతాయి కానీ ఆ స్థాయిని మించి మార్కెట్ సాధించడంలో వారు విఫలమవుతున్నారు. అలాగే హిందీ మార్కెట్ విషయంలో కూడా మెగా హీరోలు ఫెయిల్ అవుతున్నారు. రామ్ చరణ్ జంజీర్ తో హిందీలో డైరెక్ట్ సినిమా చేసాడు కానీ అది దారుణంగా బెడిసికొట్టింది.

పవన్ కళ్యాణ్ సైతం ఇలాంటి ప్రయత్నం చేసాడు. తాను నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను హిందీలో విడుదల చేసాడు. కానీ అది అక్కడ, ఇక్కడ రెండు చోట్లా ఫెయిల్ అయింది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సైతం సైరాను హిందీలో భారీ ఎత్తున విడుదల చేసాడు. 25 కోట్లకు హిందీలో బిజినెస్ చేసిన ఈ చిత్రం 12 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించగలిగింది. దీంతో మెగా హీరోలకు హిందీ మార్కెట్ కలిసిరావట్లేదనే సెంటిమెంట్ బలపడుతోంది.