తేజ సజ్జ‌తో మెగా సూప‌ర్‌గుడ్ ఫిల్మ్స్ `ఇష్క్‌`!

తేజ సజ్జ‌తో మెగా సూప‌ర్‌గుడ్ ఫిల్మ్స్ `ఇష్క్‌`!
తేజ సజ్జ‌తో మెగా సూప‌ర్‌గుడ్ ఫిల్మ్స్ `ఇష్క్‌`!

మెగా సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సంస్థ నుంచి వ‌చ్చిన ప్ర‌తీ సినిమా సూప‌ర్ హిట్టే. కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాల‌కు పెద్ద పీట వేస్తూ రికార్డు స్థాయి విజ‌యాల్ని ద‌క్కించుకున్న సంస్థ‌గా మంచి పేరు తెచ్చుకుంది మెగా సూప‌ర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థ. గ‌త కొంత కాలంగా సినిమాల నిర్మాణానికి దూరంగా వుంటూ వ‌స్తున్న ఈ సంస్థ తాజాగా మ‌ళ్లీ చిత్ర నిర్మాణం ప్రారంభించింది. ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా `జాంబిరెడ్డి` ఫేమ్ తేజ స‌జ్జ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వింక్ లేడీ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. య‌స్‌.య‌స్‌. రాజు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శుక్ర‌వారం ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. కాగా ఈ చిత్రానికి `ఇష్క్‌` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. `నాట్ ఏ ల‌వ్ స్టోరీ` అని ట్యాగ్ లైన్‌. ఇదొక రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ అని టైటిల్‌ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

కానీ ట్యాగ్ లైన్‌ని బ‌ట్టి చూస్తే మాత్రం కొత్త త‌ర‌హా క‌థ‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్టు తెలుస్తోంది. కొంత విరామం త‌రువాత మెగా సూప‌ర్‌గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. శ్యామ్ కె. నాయుడు ఛాయాగ్ర‌హ‌ణం, శ్రీ‌మ‌ణి సాహిత్యం, ఎ. వ‌ర‌ప్ర‌సాద్ ఎడిటింగ్‌, ఆర్ట్ విఠ‌ల్ స‌మ‌కూరుస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని చ‌త్ర బృందం త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నుంది.