“లవ్ యూ సార్.!” – వైరల్ అవుతున్న “మెగా షేక్ హ్యాండ్”



“లవ్ యూ సార్.!” – వైరల్ అవుతున్న “మెగా షేక్ హ్యాండ్”
“లవ్ యూ సార్.!” – వైరల్ అవుతున్న “మెగా షేక్ హ్యాండ్”

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. కేవలం తన కుటుంబం నుంచే ఎంతో మంది హీరోలు ఉన్నా కానీ, ఇప్పటికే ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ను, కొత్త డైరెక్టర్లని, కొత్త హీరోలను ఎంకరేజ్ చేస్తూ.. ప్రతి చిన్న ఫంక్షన్ కి కూడా హాజరు అవుతూ, వాళ్లకు ధైర్యం చెపుతూ.. “నేను ఉన్నాను..!” అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు ఇస్తున్న ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఉదాహరణకు చెప్పాలంటే హీరో నిఖిల్ గత సినిమా అయిన “అర్జున్ సురవరం” సినిమా అప్పటికే అనేక సార్లు విడుదల వాయిదా పడి సమస్యలు ఉంటే, మెగాస్టార్ చిరంజీవి ఒకసారి ప్రీ రిలీజ్ వచ్చి విషెస్ అందజేశారు. అంతే సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ నిఖిల్ ఇప్పుడు మూడు సినిమాలతో బిజీ అయిపోయాడు అది మెగా హ్యాండ్ పవర్ అంటే.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తన గురువుగా భావించే నితిన్ తాజా సినిమా “భీష్మ” డైరెక్టర్ వెంకీ కుడుముల ఒక భావోద్వేగమైన సంఘటనను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆయన దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన భీష్మ సినిమా ను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా షో చూసి వెంకీ ను పిలిపించుకొని, సినిమాల్లో తనకు నచ్చిన అంశాలు చెప్పి ఎంతో మెచ్చుకున్నారు. అదేవిధంగా మంచి సబ్జెక్టు ఉన్న సినిమాలను మరిన్ని చేయాలని, భవిష్యత్తులో తన సపోర్ట్ కం కంప్లీట్ గా ఉంటుందని భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వెంకీ కు షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అభిమానులు అందరూ ముద్దుగా “మెగా షేక్ హ్యాండ్” అని పిలుస్తున్నారు.

చిరంజీవి గారు కేవలం ఒక హీరో మాత్రమే కాదు నాకు దైవం లాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఆ సినిమా చూసి నాకు విషెస్ అందజేయడం అనేది నా జీవితంలో మర్చిపోలేను. మెగాస్టార్ నా పక్కనే కూర్చుని నా సినిమాలు చూస్తూ ఆనందించటం తర్వాత సినిమా గురించి నాతో మాట్లాడటం నేను జీవితాంతం గుర్తు పెట్టుకునే ఒక అద్భుతమైన సంఘటన అని భావోద్వేగానికి గురయ్యారు డైరెక్టర్ వెంకీ కుడుముల. ఇక కింద ఒక నోట్ లో.. “షేక్ హ్యాండ్ చేతులు శుభ్రపరుచుకుని తర్వాత చేయడం జరిగింది. కాబట్టి బయట పరిస్థితులు బాగుండలేదు.. కనుక అందరూ తగిన జాగ్రత్తలు పాటించవలసిదిగా” వెంకీ కుడుముల తన సందేశంలో తెలియజేశారు.

Credit: Twitter