చిరు ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్!Megastar Acharya first look on the way
Megastar Acharya first look on the way

‘సైరా నరసింహా రెడ్డి’ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హీరో రామ్ చ‌ర‌ణ్‌, నిరంజ‌న్‌రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన షూటింగ్‌తో 40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తియింది.

ఎండోమెంట్ అధికారిగా చిరంజీవి ఈ చిత్రంలో క‌నిపించ‌బోతున్న ఈ చిత్రానికి `ఆచార్మ‌` అనే టైటిల్‌ని చిత్ర బృందం ఖ‌రారు చేసిన విష‌యం తెలిసిందే. మ‌రో కీల‌క అతిథి పాత్ర‌లో హీరో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించ‌నున్నారు. రామ్ చ‌ర‌ణ్ `ఆర్ ఆర్ ఆర్‌`లో న‌టిస్తున్న సంద‌ర్భంగా `ఆచార్య‌` చిత్రీక‌ర‌ణ ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో ఈ చిత్ర షూటింగ్‌ని నిర‌వ‌ధికంగా చిత్ర బృందం నిలిపివేసింది. త్వ‌ర‌లోనే షూటింగ్‌ని ప్రారంభించాల‌ని, చిఒరుకు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని పూర్తి చేయాల‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ప్లాన్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే ఆర్ ఎఫ్‌సీలో భారీ సెట్‌ని కూడా సిద్ధం చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్రం నుంచి త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ రాబోతోంది. ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ చిత్ర టైటిల్ ఫ‌స్ట్ లుక్‌ని మేక‌ర్స్ రిలీజ్ చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని ఏర్పాట్లు చేస్తున్నారు.