`ఆచార్య‌` కోసం స్పెష‌ల్ డేట్ ఫిక్స్‌!


`ఆచార్య‌` కోసం స్పెష‌ల్ డేట్ ఫిక్స్‌!
`ఆచార్య‌` కోసం స్పెష‌ల్ డేట్ ఫిక్స్‌!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం `ఆచార్య‌`. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డితో క‌లిసి హీరో రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. దేవాదాయ భూముల స్కామ్ నేప‌థ్యంలో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు.

హైద‌రాబాద్ శివారులోని కోకాపేట్‌లో 20 ఎక‌రాల విస్తీర్ణంలో ఈ చిత్రం కోసం టెంపుల్ టౌన్ సిటీని స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దారు. క‌ళా ద‌ర్శ‌కుడు సురేష్ నేతృత్వంలో రూపొందించిన ఈ టెంపుల్ సిటీ సెట్‌కి సంబంధించిన వీడియోని హీరో మెగాస్టార్ చిరంజీవి త‌న కెమెరాలో బంధించి ఆ వీడియోని అభిమానుల‌తో పంచుకున్న విష‌యం తెలిసిందే.

రామ్‌చ‌ర‌ణ్ న‌క్స‌లైట్‌గా కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించ‌నున్న ఈ మూవీకి సంబంధించిన తాజాగా ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో వున్న ఈ చిత్రాన్ని స్ప‌త్యేక‌మైన‌ మే 9న రిలీజ్ చేయాల‌ని చిత్ర బృందం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే తేదీన 1990లో కె. రాఘ‌వేంద్ర‌రావు అద్భుత సృష్టి `జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి` విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఆ సెంటిమెంట్‌లో `ఆచార్య‌`ని ఈ ఏడాది మే 9న రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇందు కోసం 30 రోజుల పాటు రామ్‌చ‌ర‌ణ్‌పై ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించ‌నున్నార‌ట‌.