పుకార్లకు చెక్ పెట్టిన ‘ఆచార్య’ టీమ్

పుకార్లకు చెక్ పెట్టిన 'ఆచార్య' టీమ్
పుకార్లకు చెక్ పెట్టిన ‘ఆచార్య’ టీమ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య‘. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి తో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా  గత ఏడు నెలలుగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఇటీవలే క్రేజీ చిత్రాలన్నీ సెట్స్ పైకి వచ్చేస్తున్నాయి.

అయితే ‘ఆచార్య’ షూటింగ్ కి సంబందించిన అప్డేట్ మాత్రం రాకపోవడంతో ఇప్పట్లో ‘ఆచార్య’ సెట్స్ పైకి రావడం కష్టమనే వార్తలు హల్ చల్ కావడం మొదలైంది. అంతే కాకుండా చిరు ఇప్పట్లో షూట్ మొదలు పెట్టే ఆలోచనలో లేరని జనవరి వరకు ఎదురు చూడక తప్పదని ప్రచారం మొదలైంది.
ఈ వార్తల నేపథ్యంలో మేకర్స్ నుంచి అఫిషియల్ అప్డేట్ వచ్చేసింది. రూమర్లకు చెక్ పెడుతూ ‘ఆచార్య’ షూట్ ని ఈనెల 9 నుంచి మొదలు పెడుతున్నామని ప్రకటించేశారు.
 లాక్డౌన్ తరువాత  మేము అన్ని భద్రతా జాగ్రత్తలతో నవంబర్ 9 నుండి తిరిగి సెట్‌కి రావడానికి సంతోషిస్తున్నాము. ఇది నెల రోజుల షెడ్యూల్.  ఈ షెడ్యూల్ లో కీలక ఘట్టాల్ని పూర్తి చేయబోతున్నాం. వచ్చేఏడాది వేసవి లో థియేటర్లలో మెగా మాస్ హంగామా  ప్రారంభమవుతుంది’ అని మేకర్స్ వెల్లడించారు.