ప్రతిరోజు పండగే సెట్లో మెగాస్టార్ జన్మదినవేడుకలు


Prathi Roju Panduga Roju
Prathi Roju Panduga Roju

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతీ దర్శకత్వంలో గీత ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తోన్న ప్రతిరోజు పండగే చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో రెగ్యులర్ గా జరుగుతోంది.. ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుని పురస్కరించుకొని చిత్ర యూనిట్ భారీ కేక్ ని కట్ చేసి మా బాస్ కి హ్యాపీ బర్త్ డే అంటూ టీ షర్ట్స్ వెనుకాల ముద్రించిన అక్షరాలతో మెగాస్టార్ కి శుభాకాంక్షలు తెలిపారు ప్రతి రోజు పండగే చిత్ర యూనిట్.. ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ తన మేనమావ పుట్టిన రోజు వేడుకల్ని తన షూటింగ్ లో ఘనంగా జరిపి తన ప్రేమని వ్యక్తం చేసాడు.. ఈ కార్యక్రంలో దర్శకుడు మారుతీ, ప్రముఖ కన్నడ నటుడు సత్య రాజ్, తదితర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.. అతి త్వరలో ఈ చిత్రం విడుదలకానుంది..!