చిరు బ‌ర్త్‌డేకి స్పెష‌ల్ గిఫ్ట్ రెడీ!

చిరు బ‌ర్త్‌డేకి స్పెష‌ల్ గిఫ్ట్ రెడీ!
చిరు బ‌ర్త్‌డేకి స్పెష‌ల్ గిఫ్ట్ రెడీ!

మెగాస్టార్ చిరంజీవి 152వ‌ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, మ్యాటినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై శ్రీ‌మ‌తి సురేఖ స‌మ‌ర్ప‌ణ‌లో హీరో రామ్‌చ‌రణ్‌, నిరంజ‌న్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలోని కీల‌క అతిథి పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ క‌నిపించ‌‌బోతున్నారు.

రెబ‌ల్‌స్టూడెంట్ లీడ‌ర్‌గా రామ్‌చ‌ర‌ణ్ పాత్ర ప‌వ‌ర్‌ఫుల్‌గా సాగుతుందని, పాత్ర నిడివి కూడా 30 నుంచి 45 నిమిషాల పాటు వుంటుంద‌ని తెలిసింది. ఇప్ప‌టి వ‌ర‌కు 40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన ఈ చిత్రానికి `ఆచార్య‌` అనే టైటిల్‌ని ఖ‌రారు చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. చిరంజీవి ఈ టైటిల్‌ని క‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్టు ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పొర‌పాటున బ‌య‌ట‌పెట్టేశారు. దీంతో అప్ప‌టి నుంచి `ఆచార్య‌` టైటిల్ ప్ర‌చారంలో వుంది. అయితే మేక‌ర్స్ మాత్రం టైటిల్‌ని అధికారికంగా వెల్ల‌డించ‌లేదు.

ఇదిలా వుంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఈ నెల 22న జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్, టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని హీరో రామ్ చ‌ర‌ణ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించ‌డంతో మెగా  ఫ్యాన్స్ సంబ‌రాలు అంబ‌రాన్ని తాకాయి. `చిరు 152వ సినిమా ఫ‌స్ట్ లుక్‌, అండ్ మోష‌న్ పోస్ట‌ర్‌తో రెడీగా వున్నాం. ఆగ‌స్టు 22 సాయంత్రం 4 గంట‌ల‌కు మీమ్మ‌ల్ని క‌లుస్తాం` అని రామ్‌చ‌ర‌ణ్ ఎర్రని క్లాత్‌ని ప‌డికిలిలో ప‌ట్టుకుని వున్న చిరు చేయి క‌నిపిస్తున్న ఓ ఫొటోని ఈ సంద‌ర్భంగా రామ్‌చ‌ర‌ణ్ షేర్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.