`ఆచార్య‌` మోష‌న్ పోస్ట‌ర్ వ‌చ్చేసింది!

`ఆచార్య‌` మోష‌న్ పోస్ట‌ర్ వ‌చ్చేసింది!
`ఆచార్య‌` మోష‌న్ పోస్ట‌ర్ వ‌చ్చేసింది!

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా నటిస్తున్న 152వ చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంప‌నీ బ్యాన‌ర్‌పై శ్రీ‌మ‌తి సురేఖ స‌మ‌ర్ప‌ణ‌లో మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నిరంజ‌న్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌నివారం చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

మోష‌న్ పోస్ట‌ర్‌లో చిరంజీవి న‌క్స‌లైట్‌గా క‌నిపిస్తున్నారు. ధ‌ర్మ‌స్థ‌లి, న్యాయం కోసం ఎదురు చూసే ప్ర‌జ‌లు, వారికి అండ‌గా నిలిచే కామ్రేడ్‌గా చిరంజీవి క‌నిపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇందులో దేవాదాయ శాఖ‌లో జ‌రిగే అవినీతిపై పోరాడే కామ్రేడ్‌గా గ‌తి త‌ప్పిన వ్య‌వ‌స్థ‌పై పోరాడే న‌క్స‌లైట్ గా చిరంజీవి పాత్ర అత్యంత‌ ప‌వ‌ర్‌ఫుల్‌గా సాగుతుంద‌ని మోష‌న్ పోస్ట‌ర్‌ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

ఇందులో హీరో రామ్ చ‌ర‌ణ్ కూడా కీల‌క అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ పాత్ర అభ్యుద‌య భావాల‌తో సాగుతుంద‌ట‌. అత‌ని ల‌క్ష్యాన్ని నెర‌వేర్చే క్ర‌మంలో చిరంజీవి న‌క్స‌లైట్‌గా మార‌డం ఇందులో ప్ర‌ధాన అంశంగా తెలుస్తోంది. దీని వెన‌కున్న అస‌లు క‌థేంట‌న్న‌ది తెలుసుకోవాలంటే వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే. కాల‌జ్ అగర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 40 శాంతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్‌ని త్వ‌ర‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించాల‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ స‌న్నాహాలు చేస్తున్నారు.