61 లక్షల విరాళం ఇచ్చిన మెగా కుటుంబం


megastar chiranjeevi family donates 61 lakhs for kerala flood relief fundమెగాస్టార్ చిరంజీవి కుటుంబం మొత్తంగా 61 లక్షల విరాళం ఇచ్చింది . కేరళలో వరదలతో అతలాకుతలం అయ్యింది అలాగే ప్రజా జీవనం అస్తవ్యస్తం కావడంతో భారీ ఎత్తున విరాళాలు ఇస్తున్నారు . కేరళలో అవినాభావ సంబంధం ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన వంతు సహాయంగా 25 లక్షల విరాళాన్ని ప్రకటించగా తనయుడు రాంచరణ్ 25 లక్షల విరాళాన్ని , తల్లి అంజనాదేవి లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించింది ఆ మొత్తానికి తోడు చిరంజీవి కోడలు చరణ్ భార్య ఉపాసన పది లక్షల మందులను పంపించడానికి ముందుకు వచ్చింది దాంతో మొత్తం 61 లక్షల విరాళం అయ్యింది . నగదుని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధి కి ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేసారు ఇక మందులను పంపిస్తున్నారు అపోలో ఆసుపత్రి తరుపున .

చిరంజీవి సైరా …… నరసింహారెడ్డి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీ , తెలుగు , తమిళ్ బాషలలో రూపొందిస్తున్నారు . ఇక చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు . ఈ రెండు చిత్రాలు కూడా భారీ విజయాన్ని సాధిస్తాయని నమ్మకంగా ఉన్నారు .

English Title: megastar chiranjeevi family donates 61 lakhs for kerala flood relief fund