బండ్ల‌కు చిరు మెడిసిన్ ఇచ్చారా?

బండ్ల‌కు చిరు మెడిసిన్ ఇచ్చారా?
బండ్ల‌కు చిరు మెడిసిన్ ఇచ్చారా?

నిర్మాత, న‌టుడు బండ్ల గ‌ణేష్‌కు ఇటీవ‌ల క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యం తెలిసి బండ్ల తో పాటు అత‌ని స‌న్నిహితులు భ‌యాందోళ‌కు గుర‌య్యారు. క‌రోనా సోకింద‌ని తెలియ‌గానే బ‌య‌టికి చెప్ప‌కున్నా బండ్ల గ‌ణేష్ కూడా భ‌య‌ప‌డ్డార‌ట‌. అయితే అత‌నికి ఆ త‌రువాత చేసిన టెస్టుల్లో నెగెటివ్ రావ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

బండ్ల ఇంత త్వ‌ర‌గా కోలుకోవ‌డానికి కార‌ణం ఎవ‌రు? ఏం జ‌రిగింది? అని అంతా ఆరాతీస్తే మాత్రం ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి తెలిసింది. క‌రోనా సోకింద‌ని తెలియ‌గానే బండ్ల స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయార‌ట‌. మ‌నో నిబ్బ‌రంతో డాక్ట‌ర్లు సూచించిన మెడిసిన్ వాడుతూ రోగ నిరోధ‌క శ‌క్థిని పెంచుకుంటూ క‌రోనాని బండ్ల గ‌ణేష్ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే జ‌యించార‌ట‌.

అయితే బండ్ల మ‌నో నిబ్బ‌రంగా క‌రోనాని జ‌యించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన మెడిసినే అని తెలిసింది. క‌రోనా కార‌ణంగా భ‌యం భ‌యంగా వున్న బండ్ల‌కు ఫోన్ చేసి మెగాస్టార్ చిరంజీవి చెప్పిన నాలుగు మాట‌లే మెడిసిన్‌గా స‌నిచేశాయ‌ని, ఆ మాట‌ల కార‌ణంగానే బండ్ల గ‌ణేష్ త్వ‌ర‌గా కోలుకున్నార‌ని తెలిసింది.