మెగాస్టార్ `లూసీఫర్‌` రీమేక్‌కు టైటిల్ ఫిక్స్‌!మెగాస్టార్ `లూసీఫర్‌` రీమేక్‌కు టైటిల్ ఫిక్స్‌!
మెగాస్టార్ `లూసీఫర్‌` రీమేక్‌కు టైటిల్ ఫిక్స్‌!

మల‌యాళంలో సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్ క‌లిసి న‌టించిన చిత్రం `లూసీఫ‌ర్‌`. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌‌క‌త్వం వ‌హించాడు. గ‌త ఏడాది మార్చిలో విడుద‌లైన ఈ చిత్రం మ‌ల‌యాళ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల సునామీ సృష్టించింది. ఇదే చిత్రాన్ని తెలుగులో చిరు హీరోగా రీమేక్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.

ముందు ఈ రీమేక్‌కు `సాహో` ఫేమ్ సుజీత్‌ని ద‌ర్శ‌‌కుడిగా లైన్‌లోకి తీసుకొచ్చారు. అయితే సుజీత్ వ‌ర్క్ సంతృప్తిక‌రంగా లేక‌పోవ‌డంతో ఆ స్థానంలోకి వి.వి.వినాయ‌క్‌ని తీసుకొచ్చారు. వినాయ‌క్ వ‌ర్క్ కూడా చిరుకు న‌చ్చ‌క‌ప‌సోవ‌డంతో ఫైన‌ల్‌గా `త‌ని ఒరువ‌న్‌` ఫేమ్ మోహ‌న్‌రాజాని రంగంలోకి దింపారు. త‌మిళంలో రీమేక్ చిత్రాల‌కు ప‌ర్ఫెక్ట్ డైరెక్ట‌ర్‌గా పేరున్న మోహ‌న్‌రాజా ప్ర‌స్తుతం ఈ రీ‌మేక్ ప‌నుల్లో ఫుల్ బిజీ అయిపోయాడు.

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి `బైరెడ్డి` అనే టైటిల్‌ని ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది. ఇందులో చిరంజీవి రాయ‌ల‌సీమ రీజియ‌న్‌కు చెందిన ఫ్యాక్ష‌నిస్టుగా క‌నిపించ‌బోతున్నాడు. అందుకే ఈ మూవీకి ఆ టైటిల్‌ని ఫైన‌ల్ చేశార‌ట‌. ఇందులో ప‌వ‌ర్‌పుల్ పొలిటీషియ‌న్‌గా, మాఫియా డాన్‌గా రెండు పాత్ర‌ల్లోనూ చిరు క‌నిపిస్తార‌ని తెలుస్తోంది.