కొత్త బిజినెస్‌లోకి ఎంట‌ర‌వుతున్న మెగాస్టార్‌!‌


కొత్త బిజినెస్‌లోకి ఎంట‌ర‌వుతున్న మెగాస్టార్‌!‌
కొత్త బిజినెస్‌లోకి ఎంట‌ర‌వుతున్న మెగాస్టార్‌!‌

మెగాస్టార్ చిరంజీవి కొత్త బిజినెస్‌లోకి ఎంట‌ర‌వుతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. గ‌త కొంత కాలంగా టాలీవుడ్‌లో ఓ స్టూడియోని నిర్మించాల‌న్న‌ది చిరంజీవి చిర‌కాల కోరిక . ఆ కోరిక‌ని నెర‌వేర్చుకోవ‌డానికి ప్ర‌స్తుతం ఆయ‌న సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇందు కోసం స్థ‌లాన్ని కూడా కేటాయించార‌ట‌.

అల్లు ఫ్యామిలీ నుంచి ఇప్ప‌టికే గండిపేట్ ప్రాంతంలో అల్లు స్టూడియోస్ పేరుతో ఓ ఫిల్మ్ స్టూడియోని అల్లు అర‌వింద్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ నిర్మిచ‌నున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఇందు కోసం పూజా కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేశారు. ప‌దెక‌రాల స్థ‌లంలో సక‌ల సౌక‌ర్యాల‌తో స్టూడియో నిర్మాణం చేప‌డుతున్న‌ట్టు తెలిసింది.

చిరంజీవి మాత్రం స్టూడియో కాకుండా ఫ్లోర్‌ల నిర్మాణం చేప‌ట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఓ ఆర్ ఆర్ స‌మీపంలో వున్న ప‌దెక‌రాల స్థ‌లంలో సినిమా షూటింగ్‌ల‌కు, రియాలిటీ షోల‌కు అనువుగా వుండేలా చిరు నాలుగు ఫ్లోర్‌ల‌ని నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానున్న‌ట్టు తెలిసింది.