`మోస‌గాళ్లు` ట్రైల‌ర్ టాక్‌: మంచు విష్ణుకు హిట్ గ్యారెంటీ!

`మోస‌గాళ్లు` ట్రైల‌ర్ టాక్‌: మంచు విష్ణుకు హిట్ గ్యారెంటీ!
`మోస‌గాళ్లు` ట్రైల‌ర్ టాక్‌: మంచు విష్ణుకు హిట్ గ్యారెంటీ!

మంచు విష్ణు స‌క్సెస్ కోసం చేస్తున్న మూవీ `మోస‌గాళ్లు`. జెఫ్రీ గీచిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ కీల‌క పాత్ర‌లో మంచు విష్ణుకు చెల్లెలిగా న‌టిస్తోంది. ఏవిఏ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్,   24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ విడుద‌ల కాబోతోంది.

గురువారం ఈ చిత్ర ట్రైల‌ర్‌ని హీరో మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేశారు. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఐటీ స్కామ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అమెరికాలో జ‌రిగిన 4 వేల కోట్ల ఐటీ స్కామ్ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. `డ‌బ్బు సంతోషాన్నిస్తుంద‌నుకున్నా.. డ‌బ్బు సెక్యూరిటీని ఇస్తుంద‌నుకున్నా.. ఒట్టేసుకున్నా..ప్ర‌తి వాడికి సిటీ మొత్తం క‌నిపించేంత ఎత్తులో వుండాల‌ని కోరిక‌` అంటూ ట్రైల‌ర్‌లో మంచు విష్ణు చెబుతున్న డైలాగ్‌లు ఆక‌ట్టుకుంటున్నాయి.

2015లో ముంబై, గుజ‌రాత్‌లో వుంటూ ఇద్ద‌రు అన్నా చెల్లెళ్లు సింపుల్ ఐడియాతో అమెరికాలో 4 వేల కోట్ల స్కామ్ చేశారు. ఇది ఎలా జ‌రిగింది? ఆ డ‌బ్బు ఇప్పుడు ఎక్క‌డుంది? ఇంత‌కీ వాళ్లు దొరికారా? అనే ఆస‌క్తిక‌ర‌మైన పాయింట్ల‌తో ఈ మూవీని చేశామ‌ని మంచు విష్ణు చెబుతున్నారు. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతున్న ఈ మూవీ ట్రైల‌ర్ చూస్తుంటే ఈ మూవీతో మంచు విష్ణుకు హిట్ గ్యారెంటీ అనిపిస్తోంది.