`ఆచార్య‌` టెంపుల్ సిటీని ప‌రిచ‌యం చేసిన చిరు!


`ఆచార్య‌` టెంపుల్ సిటీని ప‌రిచ‌యం చేసిన చిరు!
`ఆచార్య‌` టెంపుల్ సిటీని ప‌రిచ‌యం చేసిన చిరు!

చిరంజీవి న‌టిస్తున్న భారీ చిత్రం `ఆచార్య‌`. దేవాదాయ భూముల స్కామ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస‌క‌తోంది. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డి,  హీరో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది.

కోకా పేట్‌లో వేసిన భారీ టెంపుల్ సెట్‌తో పాటు విలేజ్ సెట్‌లో కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో హీరో రామ్‌చ‌ర‌ణ్ కూడా కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే ఈ మూవీ కోసం కోకాపేట్ స‌మీపంలో 20 ఎక‌రాల విస్తీర్ణంలో టెంపుల్ సిటీని ఏర్పాటు చేశారు. ఈ విష‌యాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్ట‌ర్ వేదిక వెల్ల‌డించారు. టెంపుల్ సెట్‌కి సంబంధించిన వీడియోని కూడా అభిమానుల‌తో పంచుకున్నారు.

`ఆచార్య` సినిమా  కోసం ఇండియాలోనే అతి పెద్ద టెంపుల్ టౌన్ సెట్‌ని 20 ఎక‌రాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. అందులో భాగంగా గాలి గోపురం.. ఆశ్చ‌ర్యం గొలిపేలా ప్ర‌తీ చిన్న డీటైలింగ్‌ని అద్భుతంగా మ‌లిచారు. ఇది క‌ళా ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కే మ‌చ్చు తున‌క‌. నాకెంతో ముచ్చ‌ట‌నిపించి నా కెమెరాలో బంధించి మీతో పంచుకోవాల‌నుకున్నాను. నిజంగానే ఒక టెంపుల్ టౌన్‌లో వున్నామా అనేంత‌గా పెట్‌ని రూపొందించిన క‌ళాద‌ర్శ‌కుడు సురేష్‌ని, ఈ టెంపుల్ టౌన్‌ని విజువ‌లైజ్ చేసిన ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌ని, ఈ సెట్‌ని ఇంత అపూర్వంగా నిర్మించ‌డానికి కావాల్సిన వ‌న‌రుల్ని ఇచ్చిన నిర్మాత నిరంజ‌న్‌రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్‌ల‌ను నేను మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రేక్ష‌కుల‌కు కూడా ఈ టెంపుల్ టౌన్ ఒక ఆనందానుభూతిని క‌లిగిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు` అని మెగాస్టార్ వీడియోలో వెల్ల‌డించారు.