మెగాస్టార్ చిరంజీవి ఉగాది స్పెష‌ల్‌!


మెగాస్టార్ చిరంజీవి ఉగాది స్పెష‌ల్‌!
మెగాస్టార్ చిరంజీవి ఉగాది స్పెష‌ల్‌!

ఇన్నేళ్ల ఉగాదికి ఈ ఏడాది ఈ బుధ‌వారం వ‌చ్చే ఉగాదికి ఎంతో ప్ర‌త్యేక‌త వుంది. ఓ చ‌రిత్ర‌కు సాక్ష్యంగా నిలుస్తున్న పండ‌గ ఇది. మునుపెన్న‌డూ ఈ ప‌రిస్థిని జ‌నం ఎదుర్కోని ద‌శ‌లో వ‌స్తున్న పండ‌గ ఇది. ప్రపంచం ఒక్క‌సారిగా భ‌యాణ‌క వాతావ‌ర‌ణంలోకి బ‌ల‌వంతంగా నెట్టివేయ‌బ‌డ్డ క్ష‌ణాలివి. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో వ‌స్తున్న ఈ ఉగాది వంద కోట్ల‌కు పైబ‌డిన భార‌తీయుల జీవితాల్లో వెలుగులు నింపుతుందో లేక కారుచీక‌ట్ల‌కు స్వాగ‌తం ప‌లుకుతుందో తెలియ‌ని అయోమ‌య స్థితి ఇది.

ఈ ఉగాది రోజున అంటే బుధ‌వారం మెగాప్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియాలోకి ఎంట‌ర‌వ్వ‌బోతున్నారు. ఈ ఉగాది సంద‌ర్భంగా ఆయ‌న కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ఓ వీడియో సందేశం ద్వారా కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ అధికారిక ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. గ‌త కొంత కాలంగా చిరు సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వ‌లేదు. ఇప్పుడా అవ‌స‌రం ప‌డింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు.

`నేను ఇక నుంచి నేను కూడా సోష‌ల్ మీడియాలోకి ఎంట‌ర్ అవుదామ‌ని అనుకుంటున్నాను. అందుకు కార‌ణం ఎప్ప‌టిక‌ప్పుడు నా భావాల‌ను నా అభిమానుల‌తో షేర్ చేసుకోవాడానికి, నును చెప్పాల‌నుకున్న మెస్సేజ్‌ల‌ను ప్ర‌జ‌ల‌తో చెప్పుకోవ‌డానికి సోష‌ల్ మీడియాను వేదిక‌గా భావిస్తున్నా. నేను ఈ ఉగాది రోజు నుంచి సోష‌ల్ మీడియాలోకి ఎంట‌ర‌వుతున్నాను. అని చిరు తెలిపారు.

Credit: Twitter