అమ్మతో పాటు అందరం `వకీల్ సాబ్` థియేటర్‌లో..

Megastar family Watches Vakeel Saab
Megastar family Watches Vakeel Saab

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ న‌టించిన చిత్రం `వ‌కీల్ సాబ్‌`. శ్రీ‌రామ్ వేణు తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` ఆధారంగా ప‌వ‌న్ ఇమేక్‌కి మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. బోనీ క‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపు మూడేళ్ల విరామం త‌రువాత ప‌వ‌న్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి.

ఈ శుక్ర‌వారం వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌లైన ఈ మూవీ థియేట‌ర్ల ముందు గురువారం రాత్రి నుంచే ఫ్యాన్స్ హంగామా మొదలైంది. ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ కోసం అభిమానుల‌తో పాటు తాను కూడా అంతే ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాన‌ని ప్ర‌క‌టించిన మెగాస్టార్ అన్న‌ట్టుగానే `వ‌కీల్‌సాబ్` చిత్రాన్ని శుక్ర‌వారం రాత్రి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్ర‌త్యేకంగా థియేట‌ర్‌లో వీక్షించారు.

దీనికి సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌కు షేర్ చేశారు. త‌ల్లి అంజ‌నాదేవి, భార్య సురేఖ‌తో పాటు కుటుంబ స‌భ్యులు, పిల్ల‌ల‌తో క‌లిసి మెగాస్టార్ `వ‌కీల్ సాబ్‌` థియేట‌ర్‌లో సంద‌డి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నాయి. మెగాస్టార్ ఫ్యామిలీతో పాటు నాగ‌బాబు ఫ్యామిలీ కూడా ఏఎంబీ సినిమాస్‌లో `వ‌కీల్ సాబ్‌` మూవీని వీక్షించారు. వ‌రుణ్ తేజ్‌, సాయిధ‌ర‌మ్‌తేజ్ కూడా వీరితో క‌లిసి సినిమా చూశారు.