మెగాస్టార్ – బాబీ మూవీకి టైటిల్ ఫిక్స్‌!

మెగాస్టార్ - బాబీ మూవీకి టైటిల్ ఫిక్స్‌!
మెగాస్టార్ – బాబీ మూవీకి టైటిల్ ఫిక్స్‌!

మెగాస్టార్ చిరంజీవి మునుపెన్న‌డూ లేనంత‌గా సినిమాల విష‌యంలో స్పీడుమీదున్నారు. యంగ్ స్టార్ హీరోల‌కు స‌మానంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ప్ర‌క‌టిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తు‌న్నారు. `ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి` త‌రువాత వెంట‌నే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` చిత్రాన్ని ప‌ట్టాలెక్కించారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.

ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుండ‌గానే బ్యాక్ టు బ్యాక్ మ‌రో మూడు చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. అందులో ఒక‌టి మ‌ల‌యాళ చిత్రం `లూసీఫ‌ర్‌` ఆధారంగా తెర‌కెక్క‌బోతోంది. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో ఎన్వీ ప్ర‌సాద్‌, ఆర్‌.బి. చౌద‌రి, ప‌రాస్ జైన్ సంయుక్తంగా నిర్మించ‌బోతున్నారు. ఇటీవ‌లే లాంఛ‌నంగా ముహూర్తం జ‌రుపుకున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే సెట్స్ పైకి రాబోతోంది.

ఈ మూవీ త‌రువాత త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ `వేదాలం` ఆధారంగా మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మాస్ మ‌సాల ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌బోతున్నారు. ఈ రెండు చిత్రాల‌తో పాటు మెగాస్టార్ మ‌రో చిత్రాన్ని కూడా అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. బాబీ డైరెక్ష‌న్‌లో ఓ మాస్ చిత్రాన్ని అంగీక‌రించారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. గ్రామీణ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో చిరు మాస్ పాత్ర‌లో క‌నిపిస్తార‌ట‌. .ఈ చిత్రానికి `వీర‌య్య‌` అనే టైటిల్‌ని ఫైన‌ల్ చేసిన‌ట్టు తాజా స‌మ‌చారాం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మించ‌నున్నారు.