ప‌వ‌న్ – రానా మూవీకి మెగాస్టార్‌ టైటిల్?

ప‌వ‌న్ - రానా మూవీకి మెగాస్టార్‌ టైటిల్?
ప‌వ‌న్ – రానా మూవీకి మెగాస్టార్‌ టైటిల్?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస చిత్రాల్ని అంగీక‌రిస్తూ షాకిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` ఆధారంగా శ్రీ‌రామ్ వేణు రూపొందిస్తున్న `వ‌కీల్‌సాబ్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. క్రిష్ తో చేస్తున్న మూవీ తాజా షెడ్యూల్ ప్రారంభం కావాల్సి వుంది. ఈ రెండు చిత్రాల‌తో పాటు హ‌రీష్ శంక‌ర్ మూవీని కూడా ప‌వ‌న్ అంగీక‌రించారు.

ఇదిలా వుంటే సోమ‌వారం ప‌వ‌న్ మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా రూపొందుతున్న చిత్రాన్ని ప్రారంభించారు. సాగ‌ర్‌చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. భారీ మ‌ల్టీస్టారర్ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌న‌వ‌రి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో ప‌వ‌న్‌క‌ల్యాణ్ తో పాటు రానా న‌టిస్తున్నారు.

క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రంగా ఇప్ప‌టికే హాట్ టాపిక్‌గా మారిన ఈ చిత్రానికి ఫేమ‌స్ టైటిల్‌ని అనుకుంటున్నార‌ని తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి, క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు 1982లో న‌టించిన చిత్రం `బిల్లా- రంగా`. ఈ టైటిల్‌ని ప‌వ‌న్ – రానా చిత్రానికి ఫైన‌ల్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇందులో బిల్లాగా ప‌వ‌న్‌, రంగా గా రానా క‌నిపిస్తార‌ని తెలిసింది. అయితే త్రివిక్ర‌మ్ మాత్రం ప్ర‌జెంట్ ట్రెండ్‌కి అనుగునంగా వుండే టైటిల్‌ని పెడితే బాగుంటుంద‌ని భావిస్తున్నార‌ట‌.