మెగాస్టార్ టైటిల్‌తో విజ‌య్ సినిమా!

మెగాస్టార్ టైటిల్‌తో విజ‌య్ సినిమా!
మెగాస్టార్ టైటిల్‌తో విజ‌య్ సినిమా!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల టైటిల్స్ త‌మిళ హీరోల‌కు బాగా క‌లిసొస్తున్నాయి. చిరంజీవిని స్టార్ హీరోగా నిలబెట్టిన చిత్రం `ఖైదీ`. ఈ టైటిల్‌ని ఇటీవ‌ల కార్తి న‌టించిన చిత్రానికి పెట్టారు. అది కార్తి కెరీర్‌లోనే భారీ విజ‌యాన్ని అందించింది. మ‌ళ్లీ ఇదే హీరో `దొంగ‌` టైటిల్‌ని తీసుకుని చేసిన సినిమా కూడా మంచి విజ‌యాన్ని సాధించి విజ‌య‌వంతంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ర‌న్న‌వుతోంది. తాజాగా మెగాస్టార్‌కు సంబంధించిన ఓ హిట్ సినిమా టైటిల్‌ని త‌మిళ హీరో విజ‌య్ చిత్రానికి ఖ‌రారు చేశారు.

విజ‌య్ హీరోగా `ఖైదీ` ఫేమ్ లోకేష్ క‌న‌క‌రాజ్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. గ్జావియ‌ర్ బిట్టో నిర్మిస్తున్న ఈ చిత్రానికి `మాస్ట‌ర్` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. ఈ విష‌యాన్ని చిత్ర బృందం మంగ‌ళ‌వారం సాయంత్రం ప్ర‌క‌టించింది. ఆండ్రియా, మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు.

అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరో విజ‌య్ ప్రొఫెస‌ర్‌గా క‌నిపించ‌నున్నార‌ట‌. ఆ కార‌ణంగానే ఈ చిత్రానికి `మాస్ట‌ర్‌` టైటిల్‌ని ఫైన‌ల్ చేశార‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని క‌ర్ణాట‌క శివ‌మొగ్గ‌లోని జైల్ స‌మీపంలో చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. విజ‌య్ సేతుప‌తి  ఈ చిత్రంలో విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని త‌మిళ చిత్ర వ‌ర్గాల స‌మాచారం.