చిరంజీవి బర్త్ డే స్పెషల్ .. మెగా ర్యాప్ రెడీ!చిరంజీవి బర్త్ డే స్పెషల్ .. మెగా ర్యాప్ రెడీ!
చిరంజీవి బర్త్ డే స్పెషల్ .. మెగా ర్యాప్ రెడీ!

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఈ నెల 22న అన్న విషయం తెలిసిందే. అప్పుడే ఫ్యాన్స్ హంగామా మొదలైంది. చిరంజీవి బర్త్ డే సందర్భంగా రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి ఓ స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. ‘మెగాస్టార్స్ మెగా ర్యాప్’ పేరుతో ఈ స్పెషల్ సాంగ్ ని విడుదల చేస్తున్నారు. ‘వెంకటాద్రి టాకీస్’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ , రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ ఈ పాటని నిర్మిస్తున్నారు.

మెగా’ స్  మెగా ర్యాప్ సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను ఇటీవల విడుదల చేశారు. ఈ నెల 21న ఈ పాటను విడుదల చేయనున్నారు . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా శివ చెర్రీ నేతృత్వం లో విడుదలైన స్పెషల్ సాంగ్ పలువురి ప్రశంసలు అందుకుంది. ఇండస్ట్రీ వర్గాలు మెగా ఫ్యాన్స్ పాట గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.
మెగా ర్యాప్ కు కూడా అలాంటి స్పందనే లభిస్తుందని శివ గా ర్యాప్‌కు కూడా అటువంటి స్పందన వస్తుందని రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ ఆశిస్తున్నారట. ఈ పాటకు ఫ్రీక్ మాసన్ సంగీతం అందించారు. సురేంద్ర ర్యాప్ పాడారు. నిఖిల్ కాన్సెప్ట్ విడియో ని రూపొందించారు.