బ‌న్నీ సిస్ట‌ర్‌గా నితిన్ హీరోయిన్‌?

Megha akash in bunnys pushpa
Megha akash in bunnys pushpa

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న మాస్ మ‌సాలా హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `పుష్ప‌`. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ తో క‌లిసి ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే రంప‌చోడ‌వ‌రం, మారేడుమ‌ల్లి ప‌ర‌స‌ర ప్రాంతాల్లో జ‌రిగింది.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూట్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీలో నితిన్ హీరోయిన్ మేఘా ఆకాష్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్త‌ల గ‌త కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. కానీ మేక‌ర్స్ మాత్రం ఈ విష‌య‌మై స్పందించ‌డం లేదు. ఇందులో నిజ‌మెంత అన్న‌ది తెలియాలంటే మేక‌ర్స్ వెల్ల‌డించాల్సిందే.

నితిన్ న‌టించిన `లై` చిత్రంతో మేఘా ఆకాష్ తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది. ఆ మూవీ ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోవ‌డంతో తెలుగులో మేఘా ఆకాష్‌కు పెద్ద‌గా చెప్పుకో ద‌గ్గ అవ‌కాశాలు లేవు. అయితే `పుష్ప‌`లో బ‌న్నీకి చెల్లెలుగా కీల‌క పాత్ర‌లో మేఘా ఆకాష్ న‌టించ‌నుంద‌ని వవార్త‌లు వ‌నిపిస్తున్నాయి.  ఈ చిత్రంలో అల్లు అర్జున్ గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్‌గా ఊర మాస్ పాత్ర‌లో లారీ డ్రైవ‌ర్ పుష్ప‌రాజ్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 13న వ‌రల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయ‌బోతున్నారు.