సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న హాట్ భామ


తెలుగమ్మాయి హాట్ భామ మేఘనా నాయుడు సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది అది కూడా ఇప్పుడు కాదు మూడేళ్ళ క్రితమే ! కానీ రహస్య వివాహం చేసుకున్నట్లు ఇపుడు ప్రకటించి సంచలనం సృష్టించింది . టెన్నిస్ క్రీడాకారుడు లూయిస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది మేఘనా నాయుడు . తెలుగులో అలాగే తమిళ , హిందీ చిత్రాల్లో నటించింది మేఘనా నాయుడు .

అయితే ఈ భామ కు ఏ భాషలో కూడా స్టార్ డం రాలేదు , ఎంత హాట్ గా నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫేమస్ కాలేకపోయింది . దాంతో ఐటెం సాంగ్ లు కూడా చేసింది . కెరీర్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో లూయిస్ ని పెళ్లి చేసుకొని విదేశాల్లోనే గడుపుతోంది . అయితే వచ్చే ఏడాది హిందూ సంప్రదాయం ప్రకారం ముంబైలో పెళ్లి చేసుకొని పెద్ద ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని అంటోంది మేఘనా నాయుడు . పాండురంగడు చిత్రంలో బాలయ్య సరసన ఓ పాటలో మెరిసింది ఈ భామ . అందాలను వెండితెర మీద పరిచేసిన మేఘనా నాయుడు ది విజయవాడ కావడం గమనార్హం