మెహబూబా ఓవర్ సీస్ టాక్ ఎలా ఉందంటే


మెహబూబా ఓవర్ సీస్ టాక్ ఎలా ఉందంటేపూరి జగన్నాధ్ తనయుడు పూరి ఆకాష్ ని హీరోగా రీ ఇంట్రొడ్యూస్ చేస్తున్న చిత్రం ” మెహబూబా ”. ఇక దర్శకుడిగా పూరి జగన్నాధ్ కు కూడా మెహబూబా హిట్ జీవన్మరణ సమస్య లా మారింది ఎందుకంటే గతకొంత కాలంగా పూరి దర్శకత్వంలో వస్తున్న చిత్రాలన్నీ ఘోర పరాజయాలు పొందుతున్నాయి దాంతో అగ్ర హీరోలు డేట్స్ ఇవ్వకపోవడంతో తన కొడుకునే నమ్ముకున్నాడు . ఇన్నాళ్లు చేసినట్లుగా కాకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ ఈ సినిమా చేసాడట . ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు మెహబూబా విడుదల కాగా ఓవర్ సీస్ లో అప్పుడే షోలు పడ్డాయి . ఇక ఓవర్ సీస్ టాక్ ప్రకారం ఈ సినిమా ఎలా ఉందో తెలుసా …….

ఇండో – పాక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూరి ఆకాష్ – నేహా శెట్టి ల పెర్ఫార్మెన్స్ అదరహో లెవల్లో ఉందట ! ఒకవైపు యుద్ధ వాతావరణం మరోవైపు ప్రేమ సన్నివేశాలతో యువత కు నచ్చేలా తీసాడట పూరి . సినిమాలు ఎక్కువగా చూసేది యువతరమే కాబట్టి వాళ్లకు మెహబూబా నచ్చడం ఖాయమని అంటున్నారు ఓవర్ సీస్ జనాలు . సినిమా పెద్ద హిట్ కాదని ఓవరాల్ గా ఓకే అని అంటున్నారు . ఇక మన తెలుగువాళ్ళు ఎలా ఆదరిస్తారో చూడాలి .