విమ‌ర్శ‌ల‌పై స్ట్రాంగ్ కౌంట‌రిచ్చిన మెహ్రీన్!


Mehreen sensational comments on Aswadhama producer
Mehreen sensational comments on Aswadhama producer

`ఎఫ్‌2` చిత్రంలో హ‌నీ ఈజ్ ద బెస్ట్ అంటూ డిఫ‌రెంట్ మేన‌రిజ‌మ్‌తో ఆక‌ట్టుకున్న మెహ్రీన్‌పై ఇటీవ‌ల వ‌రుస విమ‌ర్శ‌లు వినిపించిన విష‌యం తెలిసిందే. నాగ‌శౌర్య న‌టించిన `అశ్వ‌థ్థామ‌` చిత్ర ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన‌డానికి మెహ్రీన్ ముఖం చాటేసింద‌ని, కానీ ప్ర‌మోష‌న్ పేరుతో స్టార్ హోట‌ల్‌లో బ‌స‌చేసి లాక్ష‌ల్లో డ‌బ్బులు దుబారా చేసింద‌ని దీంతో నిర్మాత హోట‌ల్ బిల్లు క‌ట్ట‌డానికి నిరాక‌రించాడ‌ని ఓ వార్ల ఇటీవ‌ల హ‌ల్‌చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ వార్త‌ల‌పై మెహ్రీన్ తాజాగా స్పందించింది.

ఇన్ని రోజులు త‌న‌పై త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం అవుతున్నా మ‌ర్యాద కోసం మౌనంగా వున్నాన‌ని, త‌న‌పై ప్ర‌చార మాధ్య‌మాల్లో ప్ర‌చారం జ‌రుగుతున్న దాంట్లో ఎలాంటి వాస్త‌వం లేద‌ని వెల్ల‌డించింది. నాగ‌శౌర్య ఫాద‌ర్ త‌న‌ని ఇబ్బందులకు గురిచేసిన మాట వాస్త‌వ‌మేన‌ని, అనారోగ్యం కార‌ణంగా తాను మీడియాతో ఇంట‌రాక్ట్ కాలేన‌ని చెప్పాన‌ని. దానికే నాగ‌శౌర్య ఫాద‌ర్ త‌న హోట‌ల్ బిల్లులు చెల్లించ‌న‌ని చెప్పార‌ని, దాంతో అవి తానే క‌ట్టుకున్నానిని చెప్పుకొచ్చింది.

అయితే వాస్తం మ‌రోలా వుంద‌ని తెలుస్తోంది. భారీ స్థాయిలో హోట‌ల్‌, లాండ్రీ బిల్లుల్ని`అశ్వ‌థ్థామ‌` చిత్ర నిర్మాత‌నే పే చేశార‌ని. అది చెన్ప‌కుండా హెహ్రీన్ తానే బిల్లుగు చెల్లించిన‌ట్టు మార్చి చెబుతోంద‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో జోరుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మెహ్రీన్ తాజా వివ‌ర‌ణ‌పై `అశ్వ‌థ్థామ‌` చిత్ర వ‌ర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి అంటున్నారు సినీ జ‌నాలు.