ఏపీ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎస్పీ చరణ్ఏపీ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎస్పీ చరణ్
ఏపీ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎస్పీ చరణ్

లెజండరీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న చేదు నిజాన్ని సంగీత ప్రియులు ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్నారు. భాషలకు అతీతంగా బాలసుబ్రహ్మణ్యం సంగీత లోకానికి చేసిన సేవ అనిర్వచనీయం. దాదాపు 40 వేలకు పైగా పాటలు పాడిన బాలు ఈరోజు మన మధ్య లేరన్నది చాలా విచిత్రంగా తోస్తోంది.

ఇక బాలసుబ్రహ్మణ్యం గుర్తుగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు ప్రభుత్వం వారి డాన్స్ అండ్ మ్యూజిక్ స్కూల్ కూడా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలగా పేరు మార్చారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎస్పీ బాలు కుటుంబం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు.

ఎస్పీ చరణ్ ట్వీట్ చేస్తూ ఇంతటి గౌరవం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.