పిచ్చ డిమాండ్ లో ఉన్న మేస్ట్రో దర్శకుడు

పిచ్చ డిమాండ్ లో ఉన్న మేస్ట్రో దర్శకుడు
పిచ్చ డిమాండ్ లో ఉన్న మేస్ట్రో దర్శకుడు

ఓటిటి హవా పెరిగాక రైటర్లకు మరింత డిమాండ్ పెరిగింది. కథలు ఉంటె వెంటనే ఎగరేసుకుని వెళ్తున్నారు. దర్శకులుగా మారిన రైటర్లకు మరింత డిమాండ్ ఉంటోంది. యువ దర్శకుడు మేర్లపాక గాంధీకి ప్రస్తుతం బోలెడంత డిమాండ్ ఉంది. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో దర్శకుడిగా మారాడు మేర్లపాక గాంధీ. ఆ తర్వాత తీసిన ఎక్స్ ప్రెస్ రాజాకు మంచి రిజల్ట్ ను సాధించింది.

అయితే నానితో చేసిన కృష్ణార్జున యుద్ధం నిరాశను మిగిల్చింది. కొంత బ్రేక్ తీసుకున్న గాంధీ ఇప్పుడు నితిన్ తో మేస్ట్రో చేస్తున్నాడు. ఈ లాక్ డౌన్ సమయంలో ఏక్ మినీ కథ అనే వెబ్ సినిమాకు కథ అందించాడు. అది మంచి రిజల్ట్ తెచ్చుకుంది. దీంతో వెబ్ సినిమాలకు మేర్లపాక డిమాండ్ బాగా పెరిగింది.

మరో రెండు వెబ్ డ్రామాలకు మేర్లపాక గాంధీ సపోర్ట్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇందులో ఆహా కోసం ఒక వెబ్ ఫిల్మ్ ఉంది. అలాగే ఒక యువ హీరోతో సినిమాకు ఇప్పటికే కమిట్ అయ్యాడు గాంధీ. మేస్ట్రో పూర్తయ్యాక ఈ సినిమా పనులు మొదలవుతాయి.