విజయ్ దేవరకొండ హీరోయిన్ ని వేధించారట


yashika anand

విజయ్ దేవరకొండ సరసన నోటా చిత్రంలో నటించిన యషిక ఆనంద్ ఓ తమిళ దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసింది . ఓ తమిళ దర్శకుడు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని , నాపై అతడికి ఆ …… ఉద్దేశ్యం ఉన్నట్లు నేరుగా కాకుండా సైగలతో చెప్పాడని అందుకే అతడికి దూరంగా ఉన్నానని దాంతో సేఫ్ అయ్యానని సంచలన వ్యాఖ్యలు చేసింది . అయితే ఆ దర్శకుడు ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు యషిక ఆనంద్ . తమిళ చిత్రాల్లో నటించిన ఈ భామ ఇటీవలే విజయ్ దేవరకొండ నటించిన ద్విభాషా చిత్రం ” నోటా ” లో నటించింది . అయితే ఈ చిత్రం అటు తమిళ్ లో కానీ ఇటు తెలుగులో కానీ హిట్ కాలేకపోయింది దాంతో ఈ భామకు అంతగా క్రేజ్ రాలేదు .

ఓ పాపులర్ దర్శకుడు నన్ను వేదించాడు అని చెప్పింది , కానీ అతడి పేరు చెప్పకపోవడం వల్ల ఎవరికి వాళ్ళు ఇతనై ఉంటాడా ? లేక అతనై ఉంటాడా అంటూ రకరకాల స్పెక్యులేశన్స్ మొదలయ్యాయి . మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా పకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా యషిక ఆనంద్ చేసిన ఆరోపణల నేపథ్యంలో తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి చర్చ మొదలయ్యింది . ఈ మీటూ ఉద్యమం వల్ల కొంతమందికి కంటి మీద కునుకు లేకుండా పోయింది పాపం .

English Title: #MeToo: Vijay devarakonda heroine yashika anand revealed her metoo