అల్లు అర్జున్ అంటే మహేష్ కు అంత కోపమెందుకు


 mhesh babu angry on allu arjun

అల్లు అర్జున్ అంటే మహేష్ బాబు కి విపరీతమైన కోపం లా ఉంది లేకపోతే అల్లు అర్జున్ సినిమా డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మహేష్ బాబు సినిమా కూడా అదే రోజున రిలీజ్ అంటూ ప్రకటనలు జారీ చేసారు దాంతో ఆయా చిత్రాల  దర్శక నిర్మాతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేసింది .నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాన్ని  మొదట ఏప్రిల్ 27 అని అల్లు అర్జున్ నిర్మాతలు ప్రకటించారు . కట్ చేస్తే మహేష్ బాబు నిర్మాత కూడా భరత్ అనే నేను చిత్రాన్ని ఏప్రిల్ 27 నే అని అనౌన్స్ చేసాడు . దాంతో తీవ్ర పోటీ ఏర్పడింది.

కట్ చేస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో దానికి ఒకరోజు ముందుగానే తమ చిత్రాన్ని రిలీజ్ చేయాలనీ భావించిన అల్లు అర్జున్ నిర్మాతలు నా పేరు సూర్య చిత్రాన్ని ఏప్రిల్ 26న రిలీజ్ చేస్తున్నట్లు పత్రికా ప్రకటన ఇచ్చారు కట్ చేస్తే ఆ వెంటనే మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రాన్ని కూడా ఏప్రిల్ 26నే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు . అంటే అల్లు అర్జున్ ని మహేష్ నీడలా వెంటాడుతున్నట్లే కనిపిస్తోంది . రెండు భారీ చిత్రాలు ఒకే రోజున రిలీజ్ కావడం వల్ల రెండు చిత్రాలకు కూడా వసూళ్ల పరంగా ఇబ్బంది తప్పదు అది తెలిసి కూడా పోటీ పడుతున్నారంటే ఎక్కడో ఇగో హర్ట్ అయ్యిందన్నా మాట .