కంగ‌న‌కు వార్నింగ్ ఇచ్చిన మికా సింగ్‌!

కంగ‌న‌కు వార్నింగ్ ఇచ్చిన మికా సింగ్‌!
కంగ‌న‌కు వార్నింగ్ ఇచ్చిన మికా సింగ్‌!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌న‌కు మికా సింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవ‌రితో పెట్టుకున్నా ప‌ర‌వాలేదు కానీ మాతో మాత్రం పెట్టుకోవ‌ద్ద‌ని హెచ్చ‌రిండం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. కేంద్ర‌న ప్ర‌వేశ పెట్టిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాలని వ్య‌తిరేకిస్తూ రైతులు దేశ రాజ‌ధాని ఢిల్లీలో గ‌త వారం రోజులుగా నిర‌స‌న చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ వివాదం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ ఆందోళ‌న‌ల‌పై కంగ‌న వివాదాస్ప‌దంగా స్పందించింది. దీనిపై నెటిజ‌న్‌లు కంగ‌న‌కు చుర‌క‌లంటించారు.

కంగ‌న ట్వీట్‌ల‌పై పంజాబ్‌కు చెందిన న‌టుడు, పాప్ సింగ‌ర్ దిల్జిత్ దోసాంజే మండిప‌డ్డారు. ఇది బాలీవుడ్ కాదు పంజాబ్ అంటూ చుర‌క‌లంటించారు. ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం తీవ్ర‌వాదం దాకా వెళ్లింది. తాజాగా కంగ‌న‌పై ప్ర‌ముఖ గాయ‌కుడు మికా సింగ్ ఘాటుగా స్పందించారు. పంజాబీ సోద‌రులు మౌనంగా వుండాల‌ని కోరుకుంటున్నా. కంగ‌న గురించి మాట్లాడ‌టం మ‌న ప‌ని కాదు. వృత్తి ప‌రంగా ఆమెతో నాకు ఎలాంటి విభేధాలు లేవు కానీ ఆమె త‌ప్పు చేసింది. ఆమెని ప‌ట్టించుకోవ‌డం మాని రైతుల‌కు మ‌ధ్ద‌తు తెల‌పండి` అని మికాసింగ్ అన్నారు.

కంగ‌న గురించి మాట్లాడుతూ పాపా కంగ‌న నువ్వు సౌమ్యంగా వుండే క‌ర‌ణ్‌జోహార్‌, హృతిక్‌రోష‌న్‌, ర‌ణ్‌వీర్‌సింగ్ లాంటి వాళ్ల‌ని ల‌క్ష్యంగా చేసుకుని త‌ప్ప‌తించుకోవ‌చ్చు. కానీ మాతో పెట్టుకోవ‌ద్దు` అని రంగ‌న‌ని  మికా సింగ్ హెచ్చ‌రించారు. మికా సింగ్ తెలుగులో మిస్ట‌ర్‌ప‌ర్‌ఫెక్ట్‌, `బ‌లుపు` చిత్రాల్లో పాట‌లు పాడారు.