త‌మ‌న్నాకు దిల్ రాజు భారీ ఆఫ‌ర్ ఇచ్చారా?


త‌మ‌న్నాకు దిల్ రాజు భారీ ఆఫ‌ర్ ఇచ్చారా?
త‌మ‌న్నాకు దిల్ రాజు భారీ ఆఫ‌ర్ ఇచ్చారా?

`ఆహా` ఓటీటీ కోసం మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా టాక్ షో చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ షో కు సంబంధించిన ఒక్కో ఎపిసోడ్‌కు 7 ల‌క్ష‌ల నుంచి 8 ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకోబోతోంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ టాక్ షో ప్రారంభం కానుండ‌గా త‌మ‌న్నాకు తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ఆఫ‌ర్‌ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఇచ్చిన‌ట్టు తెలిసింది.

వివ‌రాల్లోకి వెళితే.. రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బోనీ క‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. మ‌రో 20 శాతం చిత్రీక‌ర‌ణ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది.

ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రిని చిత్ర బృందం ఎంపిక చేయ‌లేదు. ఆ స్థానంలో లావ‌ణ్య త్రిపాఠి న‌టిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని తేలింది. తాజాగా ఆ పాత్ర కోసం త‌మ‌న్నాని చిత్ర బృందం సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది. ‌ప‌వ‌న్ ప‌క్క‌న ఛాన్స్ రావ‌డంతో త‌మ‌న్నా వెంట‌నే ఓకే చెప్పిన‌ట్టు చెబుతున్నారు. గ‌తంలో ప‌వ‌న్‌తో క‌లిసి త‌మ‌న్నా `కెమెరామెన్ గంగ‌తో రాంబాబు` చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే.