బాబూ..! నీ మాసు లుక్కు మైండ్ బ్లాక్


Mind block song from Sarileru Neekevvaru movie
Mind block song from Sarileru Neekevvaru movie

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా “సరిలేరు నీకెవ్వరు”. ప్రస్తుతం ఈ సినిమా లో ఒక అద్భుతమైన పాట రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. టీజర్ సెంటిమెంట్ ప్రకారం ఖచ్చితంగా సోమవారం సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు విడుదల అయిన “మైండ్ బ్లాక్” అనే ఈ పాట ప్రస్తుతం మహేష్ అభిమానులతోపాటు యువతరాన్ని కూడా ఒక ఊపేస్తోంది.

పాట rhythm బట్టి ఇదొక ఐటం సాంగ్ అని తెలుస్తోంది. ఈ పాటని సూపర్ స్టార్ మహేష్ బాబు ఇమేజ్ కి తగినట్లు ఉండాలని బాలీవుడ్ సింగర్ బ్లేజ్ తో పాడించాడు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. అదేవిధంగా ఫిమేల్ వాయిస్ ను దేవిశ్రీప్రసాద్ ఆస్థానంలో పర్మినెంట్ గా ఐటం సాంగులు పాడే రెనీన రెడ్డి ఆలపించారు.

ప్రస్తుతం అగ్ర హీరోలకు పాటలు అత్యంత తొందరగా మరియు వారికి నచ్చినట్లుగా రా తీస్తాడని పేరు తెచ్చుకున్న గీత రచయిత శ్రీమణి ఈ పాటకు సాహిత్యాన్ని సమకూర్చారు.

“ఎప్పుడూ ప్యాంటు వేసేవాడు ఈసారి లుంగీ కట్టాడు… ఎప్పుడూ చొక్కా వేసేవాడు ఈసారి జుబ్బా తొడిగాడు” అంటూ మొదలయ్యే ఈ పాట విని, వినగానే అభిమానుల మైండ్ కి ఎక్కే విధంగా ఉంది.

ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తూ ఉండగా, చిత్ర కథానాయకుడైన మహేష్ బాబు కూడా తన సొంత బ్యానర్ పై ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామిగా కొనసాగుతున్నాడు.

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మరియు విజయశాంతి శక్తివంతమైన పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి అటు కామెడీతో పాటు హీరోయిజాన్ని కూడా అద్భుతంగా ఎలివేట్ చేయగల దర్శకుడు. మరొకవైపు దేవిశ్రీప్రసాద్ చాలాకాలం నుండి అనేక చిత్రాలు గా మహేష్ బాబుకు మంచి మ్యూజిక్ ని అందిస్తూ వస్తున్న వ్యక్తి. ఇక ఈ మైండ్ బ్లాక్ అనే పాట ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూద్దాం.