545 కోట్ల బడ్జెట్ అట ! హతవిధీ !!Mind blowing budjet for 2.0

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న రోబో సీక్వెల్ ” 2. 0 ” చిత్రానికి 545 కోట్ల భారీ బడ్జెట్ అట ! హతవిధీ !! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే అని తెలుస్తోంది . మొదట 200 కోట్ల పైన అన్నారు షూటింగ్ లోకి దిగాక 300 కోట్లకు చేరింది ఇక షూటింగ్ అయిపోయే దశలో 400 కోట్లు అన్నారు గ్రాఫిక్స్ ఇంకా పెండింగ్ లో ఉండటంతో 450 దాటుతోంది అని హింట్ ఇచ్చారు ఇక ఇప్పుడేమో ఏకంగా 545 కోట్ల బడ్జెట్ అని ప్రకటించారు . చూస్తుంటే సినిమా రిలీజ్ అయ్యేనాటికి 600 కోట్లు అన్నా ఆశ్చర్యం లేదు మరి .

ఇంతటి బడ్జెట్ పెట్టి తీసే సినిమాకు మళ్ళీ బయ్యర్లతోపాటుగా నిర్మాతలకు కూడా నాలుగు డబ్బులు రావాలంటే కలెక్షన్ల సునామీ సృష్టించాలి . బాహుబలి , బాహుబలి 2 , దంగల్ లాంటి చిత్రాలకు మాత్రమే భారీ వసూళ్లు వచ్చాయి . ఇక 2 . 0 చిత్రానికి లాభాలు రావాలంటే 1200 కోట్ల వసూళ్లు వస్తేనే వీళ్ళు చెబుతున్న షేర్ వస్తుంది . మరి అంతటి సత్తా 2. 0 చిత్రానికి ఉందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న . గతకొంత కాలంగా రజనీకాంత్ చిత్రాలన్నీ ఘోర పరాజయాలు పొందుతున్నాయి . ప్లాప్ అవుతున్నాయి అంటే కలెక్షన్లు రాక కాదు రజనీ ప్లాప్ సినిమా కూడా 150 కోట్ల నుండి 200 కోట్ల వరకు వసూల్ చేస్తోంది కాకపోతే బడ్జెట్ ఎక్కువ కావడం బయ్యర్లకు ఎక్కువ రేటుకి అమ్మడంతో నష్టాలు వస్తున్నాయి . మరి ఇలాంటి చరిత్ర ఉన్నప్పటికీ 2. 0 చిత్రానికి 545 కోట్ల బడ్జెట్ అంటే …….. ఏమాత్రం తేడా వచ్చినా రోడ్డున పడటం ఖాయం .

English Title: Mind blowing budjet for 2.0