ఓవర్ సీస్ రైట్స్ లో సంచలనం సృష్టించిన ఆర్ ఆర్ ఆర్


 Mind blowing offer for RRR from overseas distributor
Mind blowing offer for RRR from overseas distributor

ఓవర్ సీస్ రైట్స్ లో సంచలనం సృష్టించింది ఆర్ ఆర్ ఆర్ చిత్రం . ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 70 కోట్లకు దక్కించుకున్నారట ఓవర్ సీస్ పార్టీ . జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ లు హీరోలు కావడం, ఎస్ ఎస్ రాజమౌళి దర్శకుడు కావడంతో ఈ చిత్రానికి ఇంతగా డిమాండ్ ఏర్పడింది . రాజమౌళి కెరీర్ లో ఇప్పటివరకు ప్లాప్ లేదు చేసిన చిత్రాలన్నీ కూడా ఒకదాన్ని మించి మరొకటి హిట్ అవుతూ బాహుబలి తో ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి కి డిమాండ్ ఏర్పడింది .

ఇక ఇప్పుడేమో రాజమౌళి కి తోడు మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ , చరణ్ లు హీరోలు కాబట్టి భారీ ఆఫర్ దక్కింది . అయితే ఈ వార్తని జక్కన్న అండ్ కో ద్రువీకరించాల్సి ఉంది . ఈ సినిమా 2020 లో విడుదల కానుంది కానీ అప్పుడే బిజినెస్ పరంగా సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది ఆర్ ఆర్ ఆర్ .