ఆర్ ఆర్ ఆర్ కు కళ్ళు చెదిరే ఆఫర్


Mind blowing offer for RRR

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రాంచరణ్ లు నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చారట ప్రముఖ ఛానల్ జీ ఛానల్ వాళ్ళు . ఆర్ ఆర్ ఆర్ చిత్రం తెలుగు , తమిళ , హిందీ , మలయాళ బాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే . దాంతో ఆర్ ఆర్ ఆర్ చిత్ర అన్ని బాషల శాటిలైట్ హక్కులను సొంతం చేసుకోవడానికి ఏకంగా 150 కోట్ల భారీ ఆఫర్ ని ఇచ్చిందట . అయితే కేవలం శాటిలైట్ హక్కులకు 150 కోట్ల ఆఫర్ ఇచ్చినప్పటికీ నిర్మాత దానయ్య మాత్రం ఇంకా ఒప్పుకోలేదట.

వేచి చూద్దాం అనే ధోరణిలో ఉన్నాడట దానయ్య ఎందుకంటే ఈ సినిమాకు దర్శకుడు ఓటమి ఎరుగని  ఎస్ ఎస్ రాజమౌళి కావడం . జక్కన్నకు తోడు ఎన్టీఆర్ , చరణ్ లు యాడ్ అయ్యారు దాంతో ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఎనలేని క్రేజ్ వచ్చింది . ప్రస్తుతం రెండో షెడ్యూల్ ప్రారంభమైంది . ఈ సినిమాని వచ్చే ఏడాది 2010 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు జక్కన్న .

English Title: Mind blowing offer for RRR