సంచలనం :ఆర్ ఆర్ ఆర్ నైజాం రైట్స్ 80 కోట్లా ?


జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని నైజాం లో సొంతం చేసుకోవడానికి అగ్ర నిర్మాత దిల్ రాజు తో పాటుగా ఏషియన్ సునీల్ నారంగ్ లు పోటీ పడుతున్నారట . అయితే ఇదంతా తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు ఈ ఇద్దరు కూడా . ఇక ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి వీళ్ళు కోట్ చేస్తున్న రేట్ ఎంతో తెలుసా ……. 70 నుండి 80 కోట్లట .

జూనియర్ ఎన్టీఆర్ కు అలాగే రాంచరణ్ కు మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దానికి తోడు అన్నింటికీ మించి ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ చిత్రానికి దర్శకుడు దాంతో హాట్ కేక్ అయిపొయింది ఆర్ ఆర్ ఆర్ . నైజాం లో ఏ చిత్రాన్ని 80 కోట్లకైనా సరే దక్కించుకోవాలని ఆ ఇద్దరు ప్రయత్నాలు చేస్తున్నారట . మరి ఎవరికి దక్కుతుందో ఆర్ ఆర్ ఆర్ .