బ్రేకింగ్ : హ‌రీష్‌రావుకు క‌రోనా ఎలా సోకింది!

బ్రేకింగ్ : హ‌రీష్‌రావుకు క‌రోనా ఎలా సోకింది!
బ్రేకింగ్ : హ‌రీష్‌రావుకు క‌రోనా ఎలా సోకింది!

క‌రోనా వైర‌స్ ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఎవ్వ‌రినీ విడిచి పెట్ట‌డం లేదు. సామాన్యుల‌నే కాదు సెల‌బ్రిటీల‌ని, రాజ‌కీయ నాయ‌కుల్నీ వ‌ద‌ల‌డం లేదు. తాజాగా తెలంగాణ మంత్రి త‌న్నీరు హ‌రీష్‌రావు క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించ‌డం ప‌లువురిని షాక్ కు గురిచేస్తోంది.

ఈ నెల 7న అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స్పీక‌ర్ స‌భ‌లో పాల్గొనే ప్ర‌తీ వ్య‌క్తి క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల్ప‌సిందేన‌ని స్ప‌ష్టం చేయ‌డంతో స‌భ్యులంతా క‌రోనా టెస్టులు చేయించుకున్నారు. ఈ ప‌రీక్ష‌ల్లో మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావుకు క‌రోనా సోకిన‌ట్టు తేలింది. `ప్రాధ‌మిక ల‌క్ష‌ణాలు వుండ‌టంతో టెస్ట్ చేయించుకున్నాన‌ని, టెస్టుల్లో పాజిటివ్ రిపోర్ట్ వ‌చ్చింద‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్‌రావు వెల్ల‌డించారు.

అయితే ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం బాగానే వుంద‌ని, ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల కాలంలో త‌న‌తో కాంటాక్ట్‌లో వున్న వాళ్లంతా టెస్ట్ చేయించుకోవాల‌ని, హోమ్ క్వారెంటైన్‌లో వుండాల‌ని ఈ సంద‌ర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు.