మహేష్ వల్ల ఇబ్బంది పడుతున్న మంత్రి కేటీఆర్


minister ktr facing problem with mahesh babuమహేష్ బాబు వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నానని వ్యాఖ్యానించి అందరినీ షాక్ కి గురి చేసాడు తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ . మహేష్ నటించిన భరత్ అనే నేను చిత్ర ప్రమోషన్ కి గెస్ట్ గా వచ్చిన కేటీఆర్ మహేష్ పై ఆరోపణలు చేసి మహేష్ కు షాక్ ఇచ్చాడు . ఇంతకీ మహేష్ వల్ల మంత్రి కేటీఆర్ ఎదుర్కొంటున్న సమస్య ఏంటో తెలుసా ……. షూటింగ్ లు చేస్తూనే కాస్త గ్యాప్ దొరికితే మహేష్ తన భార్యా పిల్లలను తీసుకొని విదేశాలకు వెళుతుంటారు . వారం , పదిరోజుల పాటు విదేశాలలో పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసి మళ్ళీ ఇండియాకు తిరిగి వస్తాడు . ఎంత బిజీ గా ఉన్నప్పటికీ షెడ్యూల్ గ్యాప్ లో లేక ఏదైనా సందర్భంలో కుటుంబంతో కలిసి విదేశాలకు వెళుతుంటాడు .

కానీ తెలంగాణ మంత్రి కేటీఆర్ మాత్రం తన భార్యాపిల్లల ను తీసుకొని బాహ్య ప్రపంచానికి వెళ్లడం లేదట ! మహేష్ బాబు చూడండి తన కుటుంబంతో కలిసి ఎలా వెళ్తున్నాడో ! మహేష్ బాబు కూడా బిజీ నే కదా ! మరి అతడు వెళ్తున్నప్పుడు మీరు మాత్రం మమ్మల్ని ఎందుకు తీసుకెళ్లరు అంటూ ప్రశ్నిస్తోందట . ఇదే విషయాన్ని చెబుతూ మహేష్ వల్ల నాకు ఇంట్లో పోరు ఎక్కువయిందని వాపోయాడు .