ఎన్టీఆర్ – ప్రభాస్ లకు ఛాలెంజ్


minister talasani srinivasa yadav green challenge to ntr and prabhasహరితహారం లో భాగంగా మూడు మొక్కలు నాటిన తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస యాదవ్ ఎన్టీఆర్ , ప్రభాస్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ , దిల్ రాజు లకు ఛాలెంజ్ విసిరాడు . ఈరోజు సికింద్రాబాద్ లోని తన ఇంట్లో మూడు మొక్కలు నాటిన మంత్రి జూనియర్ ఎన్టీఆర్ ని ప్రభాస్ ని ఛాలెంజ్ స్వీకరించమని కోరాడు . తెలంగాణ ప్రభుత్వం ఓ మంచి ఉద్దేశ్యంతో ఈ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని అందుకు సినిమా తారలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు .

ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ చిత్రం చేస్తుండగా ప్రభాస్ సాహో చిత్రం చేస్తున్నాడు . సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది . మంత్రి విసిరిన సవాల్ కావడంతో తప్పకుండా ఎన్టీఆర్ , ప్రభాస్ లు స్వీకరించడం ఖాయం కాకపోతే సినిమా షూటింగ్ లతో బిజీ గా ఉన్నారు కాబట్టి ఎప్పుడు స్పందిస్తారో చూడాలి .

English Title: minister talasani srinivasa yadav green challenge to ntr and prabhas